Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

షూటర్ల గురి అదుర్స్‌.. ఆసియా క్రీడల్లో భారత్‌ ఖాతాలో మరో రజతం

Indian shooters win silver medal in Asian Games 2026
Advertisement
  • పురుషుల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌లో భారత్‌కు రజతం
  • పతకం సాధించిన హిమాంశు, పార్థ్‌, రుద్రాంక్ష్‌
  • ఆసియా క్రీడల్లో మూడుకు చేరిన భారత్‌ పతకాలు
  • మూడు పతకాలూ షూటింగ్‌లోనే రావడం విశేషం
  • వ్యక్తిగత విభాగంలోనూ ఫైనల్‌కు చేరిన రుద్రాంక్ష్‌, హిమాంశు
Advertisement
ఆసియా క్రీడలు 2026లో భారత షూటర్లు మరో పతకం సాధించారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ ఈవెంట్‌లో హిమాంశు ధిల్లాన్‌, పార్థ్‌ మానే, రుద్రాంక్ష్‌ పాటిల్‌ బృందం రజతం గెలిచింది. దీంతో ఆసియా క్రీడల్లో భారత్‌ పతకాల సంఖ్య మూడుకు చేరింది. ఈ మూడూ షూటింగ్‌లోనే రావడం విశేషం.

60 షాట్ల క్వాలిఫికేషన్‌లో రుద్రాంక్ష్‌ 631.8 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. హిమాంశు 630 పాయింట్లతో ఏడో స్థానంలో, పార్థ్‌ 628.3 పాయింట్లతో నిలిచారు. ముగ్గురి స్కోర్లు కలిపి 1890.1 పాయింట్లు వచ్చాయి. దీంతో భారత్‌కు రజతం దక్కింది.

చైనా 1899.0 పాయింట్లతో స్వర్ణం గెలిచింది. ఈ క్రమంలో ప్రపంచ రికార్డు స్కోరు నమోదు చేసింది. దక్షిణ కొరియా 1884.2 పాయింట్లతో కాంస్యం సాధించింది.

రుద్రాంక్ష్‌కు ఆసియా క్రీడల్లో 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ ఈవెంట్‌లో ఇది రెండో పతకం. గత హాంగ్‌జౌ క్రీడల్లో ఇదే విభాగంలో అతడు స్వర్ణం సాధించాడు. తాజా పోటీలో రుద్రాంక్ష్‌, హిమాంశు వ్యక్తిగత విభాగం ఫైనల్‌కు కూడా అర్హత సాధించారు.

ఇక ఆదివారం జరిగిన పోటీల్లో ఎలవెనిల్‌ వలరివన్‌ రెండు రజతాలు గెలిచింది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ ఈవెంట్‌తో పాటు వ్యక్తిగత విభాగంలోనూ ఆమె రజతం సాధించింది. ఆసియా క్రీడల్లో వ్యక్తిగత విభాగంలో ఎలవెనిల్‌కు ఇదే తొలి పతకం.
Advertisement
Advertisement
Rudrankksh Patil
Asian Games 2026
Indian Shooting Team
Himanshu Dhillon
Parth Mane
Mens 10m Air Rifle

More Telugu News